ఇండియ కూటమిలో చేరలేదు: కమలహాసన్

  • లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ చేయనున్న ఎంఎన్ఎం
  • చర్చలు కొనసాగుతున్నాయన్న కమలహాసన్
  • దేశం కోసం పని చేసే ఏ కూటమిలోనైనా చేరేందుకు సిద్ధమేనన్న కమల్
రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు ప్రముఖ సినీ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. దేశం కోసం స్వలాభాలను చూసుకోకుండా పని చేసే ఏ కూటమిలో చేరేందుకైనా తాను సిద్ధమని చెప్పారు. ఇండియా కూటమిలో చేరారా? అనే ప్రశ్నకు బదులుగా... చేరలేదని తెలిపారు. స్టాలిన్ కు చెందిన డీఎంకే ఇండియా కూటమిలో భాగస్వామి అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి గురించి మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. మరోవైపు 2019 లోక్ సభ, 2021 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఎన్ఎం పార్టీ ఓటమిపాలయింది. 

Kamal Haasan
MNM
DMK
INDIA Bloc
Tamil Nadu

More Telugu News